ధర్మేంద్ర హెల్త్ పై కుమార్తె ఈషా ఏమన్నారంటే?
ధర్మేంద్ర మరణించారంటూ వచ్చిన వార్తలను కుమార్తె ఈషా దేవోల్ ఖండించారు.
ధర్మేంద్ర మరణించారంటూ వచ్చిన వార్తలను కుమార్తె ఈషా దేవోల్ ఖండించారు. ధర్మేంద్ర కుమార్తె ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేశారు. తన తండ్రి ధర్మేంద్రకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుందని ఆె తెలిపారు. తమ కుటుంబం చెప్పేంత వరకూ అలాంటి వార్తలు ప్రసారం చేయవద్దని ఈషా కోరింది. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందనిఈషా దేవోల్ తెలిపారు.
కోలుకుంటున్నారని...
ముంబయి బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తన తండ్రి ధర్మేంద్రకు చికిత్స కొనసాగుతుందని తెలిపారు. ఆయన క్షేమంగానే ఉన్నారని, తాము ప్రైవసీని కోరుకుంటున్నామని చెప్పారు. ధర్మేంద్ర కోలుకోవాలని ఆకాంక్షించిన అందరికీ ఈషా దేవోల్ కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యులు చెప్పేంత వరకూ ఇలాంటి వార్తలు ప్రచారం చేయవద్దని ఈషా దేవోల్ కోరారు.