గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ధనుష్ 'నేనే వస్తున్నా'

హీరో ధనుష్ వరుస సినిమాలతో దూసుకుపోతూ ఉన్నాడు. కోలీవుడ్ నుండి హాలీవుడ్ దాకా ఎదిగిన ధనుష్ మరోసారి కొత్తదనం ఉన్న సినిమాతో

Update: 2022-09-16 06:45 GMT

హీరో ధనుష్ వరుస సినిమాలతో దూసుకుపోతూ ఉన్నాడు. కోలీవుడ్ నుండి హాలీవుడ్ దాకా ఎదిగిన ధనుష్ మరోసారి కొత్తదనం ఉన్న సినిమాతో వస్తున్నాడు. ధనుష్ నటించిన 'నానే వరువేన్' ఈ నెలలో థియేటర్లలో విడుదల కానుంది. మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' విడుదలకు ఒక రోజు ముందు.. సెప్టెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని పరిశ్రమ వర్గాలు ధృవీకరించాయి. 'కాదల్ కొండెయిన్', 'పుదుపేట్టై', 'మయక్కం ఎన్న' వంటి సినిమాల తర్వాత ధనుష్‌తో కలిసి నాలుగవసారి సెల్వరాఘవన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'నానే వరువేన్'. ఈ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై తెలుగులో సమర్పిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో 'నేనే వస్తున్నా' పేరుతో విడుదల కానుంది. తమిళ వెర్షన్ విడుదలైన రోజునే తెలుగు వెర్షన్ కూడా విడుదల కానుంది. ధనుష్‌తో గతంలో 'అసురన్', 'కర్ణన్' వంటి చిత్రాలకు పనిచేసిన ప్రముఖ నిర్మాత కలైప్పులి ఎస్. థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు.

నేనే వస్తున్నా టీజర్ అందరినీ ఆకట్టుకుంటూ ఉంది. టీజర్ లో ధనుష్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారు. క్లాస్ రోల్ లోను, అలానే రస్టిక్ లుక్ లోను ధనుష్ ను ఈ టీజర్ లో చూడొచ్చు. యువన్ శంకర్ రాజా అందించిన బాక్గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్ గా ఉంది. ఈ చిత్రంలో ధనుష్ తో పాటు యోగి బాబు, ఇందుజా రవిచంద్రన్ మరియు ఎల్లి అవ్రామ్ కూడా ఈ చిత్రంలో నటించారు. ధ‌నుష్ ఓవైపు ఫ్యామిలీ లైఫ్‌ను లీడ్ చేసే వ్య‌క్తిగా.. కొంత‌మందిని వేటాడుతున్న వ్య‌క్తిగా రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌ల్లో క‌నిపిస్తున్నాడు.


Tags:    

Similar News