బేబీ ఎంత క్యూట్ గా ఉందో?
బాలీవుడ్ జంట దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ తమ కుమార్తె దువా ను ప్రపంచానికి పరిచయం చేశారు
బాలీవుడ్ జంట దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ తమ కుమార్తె దువా ను ప్రపంచానికి పరిచయం చేశారు. దీపావళి అనంతరం మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారి ఫొటోలను పోస్ట్ చేశారు. ఆ ఫొటోల్లో రణవీర్, దీపికా తమ బిడ్డను మమకారంగా కౌగిలించుకుని ఉన్నారు. ముగ్గురూ సంప్రదాయ వేషధారణలో ఆకట్టుకున్నారు. ఎర్ర చీరలో ఉన్న తల్లితో తానేనంటూ జతగా మెరిసిన దువా అందరినీ ఆకట్టుకుంటుంది.
దీపావళి పూజలో...
చిత్రంలో దీపికా పడుకొనే మోకాలిపై కూర్చున్న దువా తల్లితో కలిసి దీపావళి పూజలో పాల్గొనింది. “దీపావళి శుభాకాంక్షలు” అంటూ పోస్ట్‌కు శీర్షిక ఇచ్చారు. దీపికా–రణవీర్ దంపతులు 2024 సెప్టెంబర్ 8న దువాకు జన్మనిచ్చారు. ఆరేళ్ల ప్రేమ తర్వాత 2018 నవంబర్ 14న ఇటలీలో వీరి వివాహం జరిగింది. భన్సాలీ దర్శకత్వంలో ‘గోలియోన్ కి రస్లీలా రామ్‌లీలా’ సినిమా షూటింగ్‌లో వీరి పరిచయం ఏర్పడింది. తర్వాత ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ చిత్రాల్లో కూడా కలిసి ఇద్దరూ నటించారు. దువా ఎంత క్యూట్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.