Prabhas : ది రాజా సాబ్ పై క్రేజీ అప్ డేట్ .. ప్రభాస్ ఫ్యాస్స్ కు పూనకాలే
డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ అందింది.
డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ అందింది. ప్రభాస్ కు అభిమానులకు కొదవలేదు. ప్రభాస్ కేవలం నటనతోనే కాదు వ్యక్తిత్వంతోనూ అందరికీ దగ్గరయ్యారు. అందరికీ ఆప్తుడిగా మారాడు. ప్రభాస్ వందకోట్ల రూపాయలకు పైగా మార్కెట్ ఉన్న నటుడు. పాన్ ఇండియా స్టార్ కావడంతో ఇటు టాలీవుడ్, బాలీవుడ్ లో ప్రభాస్ కు తిరుగులేని హీరోగా చెలామణి అవుతున్నాడు. అలాంటి ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. షూటింగ్ శరవేగంగాపూర్తి చేసుకుంటుంది
ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకోవడంతో...
ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. హర్రర్, రొమాంటిక్,కామెడీ తో వస్తున్న ఈ సినిమాలో తాత, మనవడిగా ప్రభాస్ డబుల్ రోల్ లో ప్రేక్షకులను కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ముగ్గురు హీరోయిన్లు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిథిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫ్టస్ట గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. పెద్ద బూత్ బంగ్లా సెట్ వేసి మరీ షూటింగ్ పూర్తి చేశారు.
సీక్వెల్ చేయడానికి...
ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రభాస్ తో రామోజీ ఫిలిం సిటీలో జరిగే ఈ షూటింగ్ తో చివరి షెడ్యూల్ పూర్తవుతుందని అంటున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ది రాజాసాబ్ కు సీక్వెల్ చేయాలని నిర్ణయించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మొదటి పార్ట్ బోర్ కొట్టకుండా తక్కవు రన్ టైమ్ లో తీసుకు రావడమే కాకుండా కథ కు కూడా సీక్వెల్ చేసేందుకు అవకాశం ఉండటంతో ది రాజాసాబ్ పార్ట్ 2 చేయడానికి కూడా రెడీ అవుతున్నారట. ఈ ఏడాది డిసెంబరు 5వ తేదీన మూవీ విడుదలయిన తర్వాత సీక్వెల్ పై మేకర్స్ నిర్ణయం తీసుకోనున్నారట.