శివశంకర్ మాస్టారు ఆరోగ్య పరిస్థితి విషమం

డాన్స్ మాస్టర్ శివశంకర్ మాస్టార్ కు కరోనా సోకింది. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

Update: 2021-11-25 01:37 GMT

డాన్స్ మాస్టర్ శివశంకర్ మాస్టార్ కు కరోనా సోకింది. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. శివశంకర్ మాస్టార్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. వారు ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శివశంకర్ మాస్టార్ తో పాటు ఆయన పెద్దకొడుకు, భార్య కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం కుటుంబం మొత్తం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

కుటుంబం మొత్తం...
శివశంకర్ మాస్టార్ ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకిందని వైద్యు చెప్పారు. శివశంకర్ం మాస్టార్ చిన్న కుమారుడు అజయ్ కృష్ణ వారి బాగోగులను చూసుకుంటున్నారు. శివశంకర్ మాస్టార్ ఆర్థిక పరిస్థితి బాగాలేదని, టాలీవుడ్ పెద్దలు ఆదుకోవాలని ఆయన కుమారుడు కోరుతున్నారు. టాలీవుడ్ లో అనేక హిట్ సినిమాలకు శివశంకర్ మాస్టార్ నృత్య దర్శకుడిగా వ్యవహరించారు.


Tags:    

Similar News