బిగ్ బాస్ "సిరి" కి కరోనా
బిగ్ బాస్ సీజన్ 5లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో నిలిచిన సిరి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. కోవిడ్ నిబంధనలను పాటించని ఏ ఒక్కరినీ వదలకుండా వెంటపడుతుంది. తాజాగా బిగ్ బాస్ నటి సిరికి కరోనా సోకింది. బిగ్ బాస్ సీజన్ 5లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో నిలిచిన సిరి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆమెకు స్వల్ప లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది.
తనతో కాంటాక్ట్ అయిన వారు..
కరోనా సోకడంతో సిరి తనను వారం రోజుల నుంచి కాంటాక్ట్ అయిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. సిరి ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొనడటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.