ఈ స్పీచ్ తో అయినా ఫ్యాన్స్ మధ్య వార్ ఆగుతుందా ?

ఇప్పటికీ ఇండస్ట్రీలో ప్రతిఒక్కరూ ప్రతిరోజూ నాతో సహా అందరూ ఆయన గురించి మాట్లాడాల్సిందే. ఆయన నటించిన..

Update: 2023-05-21 09:49 GMT

మే 28వ తేదీన నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలను పురస్కరించుకుని శనివారం సాయంత్రం కూకట్ పల్లిలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి.. సీనియర్, యువ హీరోలు కూడా రావడం విశేషం. ఈ వేడుకకు హాజరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. అనివార్య కారణాలతో జూనియర్ ఎన్టీఆర్ ఈ వేడుకకు హాజరుకాలేకపోవడం.. రామ్ చరణ్ హాజరు కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

"ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయిలో నేను లేను. మన స్థాయి, మన ఆలోచన స్థాయిని మించి ఎన్టీఆర్ గారు శిఖరస్థాయిని అందుకున్నారు. అలాంటి వ్యక్తుల గురించి ఎక్కువ మాట్లాడటం కంటే.. ఆయన నడిచిన దారిలోనే మనమూ నడవడం గౌరవంగా ఉంటుంది. ఇప్పటికీ ఇండస్ట్రీలో ప్రతిఒక్కరూ ప్రతిరోజూ నాతో సహా అందరూ ఆయన గురించి మాట్లాడాల్సిందే. ఆయన నటించిన ఇండస్ట్రీలోనే నేను నటిస్తున్నందుకు గౌరవంగా ఉంది. సౌత్ ఇండియా పేరు ఇంటర్నేషనల్ లెవెల్ ఇప్పుడు వినిపిస్తుందని అందరూ అంటున్నారు. కానీ ఇప్పుడు మేము కాదు, ఆ కాలంలోనే దేశదేశాల్లో సౌత్ ఇండియా పేరుని వినిపించేలా చేశారు పెద్ద ఎన్టీఆర్. తెలుగు ఇండస్ట్రీ బ్రతికి ఉన్నంతవరకూ ఎన్టీఆర్ పేరు బ్రతికే ఉంటుంది. ఆయన సీఎం అయ్యాక నేను ఎన్టీఆర్ తో కలిసి టిఫిన్ కూడా చేశాను. ఇప్పటికి మర్చిపోలేని విషయం, ఆయనతో అలా కలిసి టిఫిన్ చేయడం నా అదృష్టం" అని రామ్ చరణ్ పేర్కొన్నారు.
స్పీచ్ ముగించే ముందు చరణ్.. తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. బాలయ్య మెగా వారింట్లో జరిగే అన్నివేడుకలకు వస్తారని చరణ్ చెప్పాడు. అలాగే నందమూరి అభిమానులను ఇలాంటి వేదిక ద్వారా కలిసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. చివర్లో జైఎన్టీఆర్ అని చరణ్ అనడంతో.. సభాప్రాంగణం మారుమ్రోగింది. చరణ్ అలా చెప్పడంతో మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. టాలీవుడ్ లో హీరోలంతా ఒకటే. సినిమాల పరంగా పోటీ ఉన్నా.. స్నేహపూర్వకంగా ఉంటారని చరణ్ మరోసారి తెలిపాడు. ఇకనైనా.. హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ ఆగుతుందా ? లేదో చూడాలి.




Tags:    

Similar News