ఆర్జీవీ 'వ్యూహం'కి సెన్సార్ బోర్డు దెబ్బ..

ఆర్జీవీ 'వ్యూహం' మూవీకి అసలు సెన్సార్ బోర్డు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది..? దాని పై వర్మ రియాక్షన్ ఏంటి..?

Update: 2023-11-02 13:41 GMT

టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఏపీ పాలిటిక్స్ ఆధారంగా వ్యూహం, శపథం అనే సినిమాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లైఫ్ లో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనలు తీసుకోని వర్మ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులకు సంబంధించిన పాత్రలు కనిపించబోతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పోస్టర్స్ బాగా వైరల్ అయ్యాయి.

వ్యూహం సినిమాని నవంబర్ 10న రిలీజ్ చేస్తానంటూ ఆర్జీవీ ఆల్రెడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మరో వారం రోజుల్లో రిలీజ్ అవుతుంది అనుకున్న ఈ సినిమాకి ఇప్పుడు సెన్సార్ బోర్డు ఎదురు దెబ్బ తగిలేలా చేసింది. ఈ మూవీ రిలీజ్ ని అడ్డుకుంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంతకీ అసలు సెన్సార్ బోర్డు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది..? దాని పై వర్మ రియాక్షన్ ఏంటి..?
మూవీలోని పాత్రలు నిజ జీవితంలోని వ్యక్తులను పోలి ఉన్నాయని, పేర్లు కూడా ఆ వ్యక్తులకు సంబంధించినవే పెట్టారని, ఇందుకు సెన్సార్ అంగీకారం ఇవ్వలేదని.. చెప్పినట్లు తెలుస్తుంది. ఇక దీని పై వర్మ కూడా స్పందించి కామెంట్స్ చేశాడు. "అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడ్ని ఆపలేరు. సెన్సార్ బోర్డు రివైజ్ కమిటీకి ఎందుకు వెళ్ళమని చెప్పారో నాకు తెలియదు. దీని మీద టిడిపి వాళ్ళు ఏమన్నా పిర్యాదు చేసారా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే సెన్సార్ చెప్పినట్లు మేము రివైజ్ కమిటీకి వెళ్తాము. దీని వాళ్ళ 10న వ్యూహం రిలీజ్ చేయడం కుదరడం లేదు" అంటూ వెల్లడించాడు.
మరి ఆర్జీవీ సినిమా రిలీజ్ కోసం కొత్త వ్యూహం ఏమన్నా రచిస్తాడా అనేది చూడాలి. కాగా ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత జగన్ ఎదుర్కొన్న సందర్భాలు, సమస్యలు చూపిస్తూ సీఎం ఎలా అయ్యారు అనేది చూపించబోతున్నారు.


Tags:    

Similar News