బాలీవుడ్‌లో విషాదం.. నిర్మాత, కమెడియన్ మృతి..
బాలీవుడ్ లో రోజు వ్యవధిలో ఇద్దరు సినీ ప్రముఖుల మరణించడం.. హిందీ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. మొన్న నిర్మాత, నేడు కమెడియన్..
బాలీవుడ్ లో రోజు వ్యవధిలో ఇద్దరు సినీ ప్రముఖుల మరణించడం.. హిందీ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. హిందీ, తెలుగులో పలు సినిమాలు నిర్మించిన ముకేశ్ ఉదేశి మరణవార్త కొంచెం లేటుగా వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న ముకేశ్.. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కూడా చేయడానికి వైద్యులు ప్లాన్ చేశారు.
అయితే ఈలోపే అయన కన్నుమూశారు. చెన్నైలోని ఒక హాస్పిటల్ లో సోమవారం సాయంత్రం ముకేశ్ తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్ లో పలు సినిమాలకు లైన్ ప్రొడ్యూసర్ గా చేసిన ముకేశ్.. ఆ తరువాత పలు సినిమాలకు నిర్మాత కూడా వ్యవహరించారు. హిందీలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ప్రతిబంధ్, ది జెంటిల్ మ్యాన్ సినిమాలకు అల్లు అరవింద్ తో కలిసి నిర్మించారు. ముకేశ్ తో ఉన్న స్నేహంతో.. ఆలు అరవింద్ వైద్యం విషయంలో సహాయం చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ వార్త మరవక ముందే.. మరో మరణవార్త అందర్నీ కలిచివేసింది. ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ కుమార్ ఖోస్లా అలియాస్ బీర్బల్ నేడు కన్నుమూశారు. వయసు కారణంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సతీందర్ కుమార్‌కి.. ఈరోజు (సెప్టెంబర్ 13) ఉదయం గుండెపోటు రావడంతో వెంటనే ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ ఆయన తుదిశ్వాస విడిచారు.
సతీందర్ కుమార్ ఖోస్లా 1967లో నటుడిగా బాలీవుడ్ లో కెరీర్ స్టార్ చేశారు. ఇక అప్పటినుండి హిందీ, మరాఠీ, పంజాబీ, భోజ్ పురి భాషల్లో దాదాపు 500కు పైగా సినిమాల్లో నటించారు. వెండితెరపై కమెడియన్ బీర్బల్ గా ఎంతో పేరుని సంపాదించుకున్న ఈ నటుడు ఇప్పుడు లేరు అన్న వార్త బాలీవుడ్ ఆడియన్స్ ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తుంది. వీరి మరణం పై సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.