జ‌నాల‌కు న్యాయం ... ల‌వ‌ర్‌కు అన్యాయం చేసిన సీఎం భ‌ర‌త్‌

Update: 2018-04-20 17:39 GMT

భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన మ‌హేష్‌బాబు భ‌ర‌త్ అనే సీఎం రోల్‌లో అద‌ర‌గొట్టేశాడు. యంగ్ డైన‌మిక్ లీడ‌ర్‌గా ఏ మాత్రం అనుభ‌వం లేకుండా సీఎం అయినా అత‌డు తీసుకున్న నిర్ణ‌యాలు ప్ర‌జ‌ల్లో అత‌డిని కేవ‌లం 8 నెల‌ల్లోనే దేవుడిగా మార్చేస్తాయ్‌. క‌థ ప్ర‌కారం ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్రదేశ్‌కు సీఎంగా ప‌నిచేసిన భ‌ర‌త్ ప్ర‌జ‌ల‌కు మంచి చేసినా అత‌డి ల‌వ‌ర్‌కు మాత్రం అన్యాయం చేశాడు. ఫ‌స్టాఫ్‌లో సీఎంగా కైరాను తొలి చూపులోనే ప్రేమించేస్తాడు. మ‌హేష్‌కు - కైరాకు నాలుగైదు సీన్ల‌కు మించి లేవు.

సీఎం ల‌వ‌ర్ వ‌సుమ‌తిగా కైరా అద్వానీ అందంగా క‌న‌ప‌డ‌డంతో పాటు క్యూట్ లుక్స్‌తో ఆక‌ట్టుకుంది. ఆమె అభిన‌యం కూడా బాగుంది. అయితే ద‌ర్శ‌కుడు కొర‌టాల మాత్రం క‌థానుసారంగా ఆమెకు తెర‌మీద ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్సీ లేకుండా చేసి అటు ఆమె క్యారెక్ట‌ర్‌తో పాటు ఇటు అభిమానుల‌ను కూడా ఉసూరుమ‌నిపించాడు. తన పాత్ర సినిమాలో ఓ కీలక మలుపుకు కారణమైంది కానీ.. ఆమె ప్రత్యేకత చూపించడానికి మాత్రం అవకాశం లేకపోయింది.

సెకండాఫ్‌లో ఆమె పాత్ర మ‌రీ దారుణం. పాట‌లు వ‌చ్చేట‌ప్పుడు మాత్ర‌మే ఆమె క‌నిపిస్తుంటుంది. కైరా వ‌స్తే పాట వ‌స్తుంద‌ని క్లారిటీ వ‌చ్చేస్తుంటుంది. ఇంకా చెప్పాలంటే మ‌హేష్ ప‌క్క‌న కైరా చ‌క్క‌గా సెట్ అయ్యింది. అయితే రొమాంటిక్ సీన్ల‌లో మెప్పించిన ఆమె ఓవ‌రాల్‌గా యంగ్ సీఎం ల‌వ‌ర్‌గా మంచి మార్కులే వేయించుకుంది. ఓ సాంగ్‌లో మాత్రం కాస్త అందాలు శృతి మించాయి.

ప్రీ క్లైమాక్స్‌లో భావోద్వేగ స‌న్నివేశాల్లోనూ ఆమె న‌ట‌న హార్ట్ ట‌చ్చింగ్‌గా ఉంది. ఓవ‌రాల్‌గా ఆమెకు ఇచ్చిన సీన్ల‌లో మంచి న‌ట‌నే క‌న‌ప‌రిచినా ఆమెను స‌రిగ్గా ఈ క‌థ‌లో వాడుకోలేక‌పోయారు. మ‌రిన్ని సీన్లు ఆమెకు ఇచ్చి ఉండాల్సింద‌నిపించింది.

మ‌హేష్ చివ‌రి సినిమాలు చూస్తే బ్ర‌హ్మోత్స‌వంలో స‌మంత‌, కాజ‌ల్‌, ప్ర‌ణీత కాని ఆగ‌డులో త‌మ‌న్నా, స్పైడ‌ర్‌లో ర‌కుల్‌, వ‌న్‌లో కృతీస‌న‌న్ సరిగా సెట్ అయిన‌ట్టు అనిపించ‌రు. భ‌ర‌త్‌లో మాత్రం ఒడ్డూ పొడుగూ క‌రెక్టుగా ఉన్న కైరా మ‌హేష్ ప‌క్క‌న ప‌ర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యింది.

Similar News