Jamal Kudu Song : 'జమాల్ కుడు' అంటే ఏంటి.. భామల ఇన్‌స్టా రీల్స్ చూశారా..
యానిమల్ మూవీలోని 'జమాల్ కుడు' సాంగ్ అర్ధం ఏంటి..?
Jamal Kudu instagram reels
Jamal Kudu Song : సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో బోల్డ్ అండ్ వైల్డ్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా 'యానిమల్'. కాగా ఈ సినిమాలో విలన్ గా నటించిన బాబీ డియోల్ ఎంట్రీ సమయంలో ఉపయోగించిన ఒక మ్యూజిక్ బిట్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతుంది. 'జమాల్ కుడు' అనే ఓ ఇరానియన్ ఓల్డ్ సాంగ్ ని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా ఉపయోగించారు.
1950's లో రూపొందించిన ఈ ఇరానియన్ సాంగ్ యానిమల్ కోసం సందీప్ వంగ.. రిఫ్రెషింగ్ ట్యూన్స్ తో మళ్ళీ రీ క్రియేట్ చేయించారు. ఈ పాటలోని 'జమాల్ జమలేక్ జమలూ జమల్ కుడు' లిరిక్స్ క్యాచీగా ఉండడంతో.. ప్రతి ఒక్కరు హమ్ చేస్తున్నారు. అయితే ఆ క్యాచీ లిరిక్ లైన్ మీనింగ్ ఏంటో తెలుసా..? ఆ పదాలకు తెలుగు అర్ధం ఏంటి..?
జమాల్ జమలేక్ జమలూ జమల్ కుడు అంటే.. 'ఓ నా ప్రేమ, నా ప్రియమైన, నా మధుర ప్రేమ' అని అర్థమట. ఒకరి పై ప్రేమని వ్యక్తపరచడమే వీటి అసలు అర్ధం అని తెలిసింది కదా ఇప్పుడు. మరి ఇక ఆలస్యం ఎందుకు.. ఈ పదాలను ఉపయోగించి మీరు కూడా మీకు ఇష్టమైన వారిపై మీ ప్రేమని వ్యక్తపరచేయండి.
కాగా ఈ క్యాచీ మ్యూజిక్ బిట్‌కి, బాబీ డియోల్ డాన్స్‌కి అట్రాక్ట్ అయిన యూత్.. దానిని రీ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియా రీల్స్ చేస్తున్నారు. వీరిలో కొందరు అందాల భామలు చేసిన రీల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటి వైపు ఒక లుక్ వేసేయండి.