అనిల్ రావిపూడి – చెర్రీ మీటింగ్ నిజమా?

ఎఫ్ 2 తర్వాత మహేష్ బాబు.. అనిల్ రావిపూడి కి సినిమా చెయ్యడమే మాములు షాకింగ్ విషయం కాదు. ఎందుకంటే ఎఫ్ 2 అదృష్టం కొలది హిట్ [more]

Update: 2020-01-30 05:52 GMT

ఎఫ్ 2 తర్వాత మహేష్ బాబు.. అనిల్ రావిపూడి కి సినిమా చెయ్యడమే మాములు షాకింగ్ విషయం కాదు. ఎందుకంటే ఎఫ్ 2 అదృష్టం కొలది హిట్ అయిన మూవీ. ఆ సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్, సెకండ్ హాఫ్ బోర్. అలాంటిది ఆ సినిమా అనుకోకుండా బ్లాక్ బస్టర్ లిస్ట్ లోకి వెళ్లడం.. తర్వాత అనిల్ రావిపూడి ఏకంగా మహేష్ తగిలి సరిలేరు నీకెవ్వరూ అంటూ సినిమా చేసాడు. సరిలేరు సినిమా మాస్ కి ఎక్కబట్టి.. ఆ మాత్రం హిట్ అయ్యింది. అందులోనూ నిర్మాతలు అల వైకుంఠపురములో సినిమా మీద మా సినిమానే గొప్ప అని చూపించుకోవడానికే ఇష్టమొచ్చిన అంకె వేసి పోస్టర్స్ వదులుతున్నారు అయితే ఈ కలెక్షన్స్ ఎవరికీ ఎంతవరకు కలిసొచ్చాయో తెలియదు కానీ.. అనిల్ రావిపూడి కి బాగా కలిసొచ్చినట్టుగా కనబడుతుంది.

దర్శకుడు అనిల్ అదృష్టంతో మహేష్ తో సినిమా చేయగలిగాడు. మహేష్ క్రేజ్ తో ఆ సినిమా ఎలాగో బ్రేక్ ఈవెన్ కి దగ్గరయింది. లేదంటే మరో హీరో అయితే.. ఈ సినిమాకి ఆపాటి కలెక్షన్స్ రావడం కష్టమయ్యేది. అయితే ఈ సినిమా తర్వాత అనిల్ ఎఫ్ 2 సీక్వెల్ మీద కూర్చుంటాడు అనుకుంటే.. తాజాగా అనిల్ రావిపూడి మెగా కాంపౌండ్ లోకి అడుగెట్టినట్లుగా ఫిలింనగర్ టాక్. ఎందుకంటే ఎఫ్ 2 సీక్వెల్ మొదలెట్టడానికి చాలా టైం పడుతుంది. వరుణ్ తేజ్, వెంకటేష్, మూడో హీరో రవితేజ ఎవరి సినిమాల్తో వారు బిజీ. కనక ఈలోపు అనిల్ రావిపూడి మెగా హీరో రామ్ చరణ్ ని కలిసి కథ వినిపించాడని, ఈ కథ విని.. చరణ్ కూడా బాగా ఇంప్రెస్ అయ్యి… వెంటనే ఈ స్టోరీలైన్‌ను డెవలప్ చేయమని అనిల్ కి చెప్పినట్టుగా ఫిలింనగర్ టాక్. మరి RRR షూటింగ్ లో బిజీ అయిన చరణ్ అనిల్ తో కలిసి మీటింగ్ పెట్టాడంటే ఎక్కడో తేడా కొడుతోంది. కానీ ఒక్కోసారి అవే నిజాలయ్యే అవకాశం ఉంది కూడా.

Tags:    

Similar News