రష్మిక మందన్న స్టార్ హీరోయిన్ కాదా?

ఈమాటన్నది ఎవరో కాదు.. దర్శకుడు అనిల్ రావిపూడి. మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ లాంటి భారీ బడ్జెట్ సినిమా చేసిన అనిల్ రావిపూడి. ఆ సినిమాలో మహేష్ [more]

Update: 2020-01-09 06:30 GMT

ఈమాటన్నది ఎవరో కాదు.. దర్శకుడు అనిల్ రావిపూడి. మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ లాంటి భారీ బడ్జెట్ సినిమా చేసిన అనిల్ రావిపూడి. ఆ సినిమాలో మహేష్ కి జోడిగా రష్మిక మందన్న ని సెలెక్ట్ చేసి అందరికి షాకిచ్చాడు. ఇప్పుడిప్పుడే హీరోయిన్ క్రేజ్ తెచ్చుకుంటున్న రష్మిక కి మహేష్ సినిమాలో ఛాన్స్ ఇచ్చి ఆమెకి మాత్రం మంచి చేసాడు. అయితే రష్మిక ని మహేష్ కి హీరోయిన్ గా అనుకున్నప్పుడు. చాలామంది తనకి ఫోన్ చేసి రష్మిక మందన్న హీరోయిన్ ఏమిటి.. మహేష్ పక్కన రష్మిక ఏం బావుంటుంది అని అన్నారట. కాని అనిల్ రావిపూడి మాత్రం మహేష్ పక్కన ఈ కథకి స్టార్ హీరోయిన్ అయితే బావుండదని.. అందుకే సాదాసీదాగా ఉండే రష్మిక ని సెలెక్ట్ చేసాడట.

అయితే సరిలేరు ట్రైలర్ చూసాక రష్మిక ని ఎందుకు ఈ సినిమాలో తీసుకున్నానో అందరికి ఆర్ధమైందని. ఆ కేరెక్టర్ కి ఆమె అయితేనే పర్ఫెక్ట్ అని ఇప్పుడు అందరూ అంటున్నారని చెబుతున్నాడు. ఇక రష్మిక మందన్న ని స్టార్ హీరోయిన్ కాదన్నా అనిల్ రావిపూడి.. ఫిదా సినిమాలో సాయి పల్లవిని కాకుండా మరో టాప్ హీరోయిన్ ని తీసుకుంటే. ఎలా ఉండేదో. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరూ కి కూడా స్టార్ హీరోయిన్ ని తీసుకుంటే అలానే ఉండేదని.. అయినా రష్మిక మంచి నటి అని.. ఆమె చేసే అల్ల్లరి సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది అని చెప్పడమే కాదు.. ఈ సినిమా తర్వాత రష్మిక స్టార్ హీరోయిన్ గా నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది అని చెబుతున్నాడు.

Tags:    

Similar News