Harihara Veeramallu : "నేను రాకూడదని మీరు చూస్తున్నారు" ఆ ఒక్క డైలాగ్ తోనే?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ విడుదలకు త్వరలో విడుదల కానుంది
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ విడుదలకు త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్స్ ఆకట్టుకుంటున్నాయి. "నేను రావాలని చాలా మంది ఆ దేవుడికి దండం పెట్టుకుంటారు... కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు" అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో పవన్ కల్యాణ్ టీజర్ వైరల్ అయింది. అంటే ఈ డైలాగు వింటే ఖచ్చితంగా పొలిటికల్ టచ్ ఉన్నట్లు కనపడుతుంది. రాజకీయ డైలాగులతో పవన్ ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే హరిహరవీరమల్లు ప్రమోషన్ లో మాత్రం బలహీనంగానే కనపడుతుంది. పవన్ కల్యాణ్ మూవీ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ఆయనకు అభిమానులు కూడా అంతే రేంజ్ లో ఉంటారు.
టిక్కెట్ల ధరలను...
అయితే పవన్ కల్యాణ్ సినిమా విడుదల కానుండటంతో ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకూ ఈ మూవీ ప్రమోషన్లలో పవన్ కల్యాణ్ పాల్గనొ లేదు. సినీ నిర్మాత ఎఎం రత్మం, దర్శకుడు జ్యోతి కృష్ణ, నిధి అగర్వాల్ లు మాత్రమే ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. పవన్ కల్యాణ్ కేవలం టీజర్, ట్రైలర్లకే పరిమితం అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా ఉండటంతో పవన్ కల్యాణ్ ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలిసింది. దీంతో హరిహరవీరమల్లు ఒక రేంజ్ లో ఉండాల్సిన ప్రమోషన్లలో పవన్ పాల్గొనకపోవడంతో కొంత వీక్ గా కనిపిస్తుంది.
నాలుగు రోజులే...
ఈ మూవీ విడుదలకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ లో మాత్రం మంచి ఊపు కనిపిస్తుంది. ఈ సినిమాను పదిహేడో శతాబ్దం నేపథ్యంలో జరిగిన కథ కావడంతో అందరిలోనూ ఆసక్తి రేపుతుంది. అయితే ఇది ఎవరి కథ కాదని, కల్పిత పాత్రలోనే ఈ కథనం కొనసాగుతుందని మేకర్స్ తో పాటు డైరెక్టర్ జ్యోతికృష్ణ తెలిపారరు. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత విడుదలయ్యే తొలి సినిమా కావడంతో టాలీవుడ్ లో మంచి బజ్ ఏర్పడింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఖాయమని మేకర్స్ విశ్వాసంతో ఉన్నారు.