Suma : పోలీసులతో యాంకర్‌ సుమ కొడుకు గొడవ.. వీడియో వైరల్..

ఇంకొన్ని రోజులో తన నటించిన మొదటి సినిమా రిలీజ్ ఉన్న సమయంలో సుమ కొడుకు రోషన్.. హైదరాబాద్ పోలీసులతో గొడవ పెట్టుకున్నాడు.

Update: 2023-11-16 14:44 GMT

Suma : యాంకర్ సుమ కొడుకు రోషన్‌ కనకాల 'నిర్మల కాన్వెంట్' సినిమాలో ఒక చిన్న పాత్ర చేసి వెండితెరకు పరిచయమయ్యాడు. ఇప్పుడు హీరోగా పరిచయం అవుతూ ‘బబుల్ గమ్’ అనే సినిమా చేస్తున్నాడు. న్యూ ఏజ్ లవ్ స్టోరీతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఒక చిన్న టీజర్ రిలీజ్ చేసి యూత్ లో మంచి బజ్ ని క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కో సాంగ్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు.

ఇంకొన్ని రోజులో తన నటించిన మొదటి సినిమా రిలీజ్ ఉన్న సమయంలో రోషన్.. హైదరాబాద్ పోలీసులతో గొడవ పెట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఫ్రెండ్స్ తో కలిసి కారులో ఎంజాయ్ చేస్తూ వెళ్తున్న రోషన్ కి పోలీసులు అడ్డొచ్చి ప్రశ్నించారు. రోషన్ వారికీ దురుసుగా బదులిచ్చాడు. ఇంతకీ అసలు ఏమైంది..? ఆ వీడియో నిజమేనా..?
అసలు విషయం ఏంటంటే.. ఇటీవల సినిమా ప్రమోషన్స్ అని చెప్పి వెరైటీగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి ప్రయత్నాల్లో ఇది ఒకటి. తాను నటించిన ‘బబుల్ గమ్’ ప్రమోషన్స్ కోసం రోషన్ చేసిన ఒక ప్రాంక్ ప్రయత్నం ఇది. ఆ వీడియోలో ఉన్న పోలీసులు కూడా నిజమైన వారు కాదు. ఆ ప్రాంక్ వీడియోని మీరుకూడా చూసేయండి.
Full View
ఇక ఈ ‘బబుల్ గమ్’ సినిమా విషయానికి వస్తే.. రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ డైరెక్టర్ గతంలో కృష్ణ అండ్ హిస్ లీల, క్షణం వంటి హిట్టు సినిమాలు తెరకెక్కించారు. మానస చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో మహేశ్వరి మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రాన్ని సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 29న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ టైములో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Full View

Tags:    

Similar News