Rashmika : రష్మిక ఫేక్ మార్ఫింగ్ వీడియో.. అమితాబ్ బచ్చన్ సీరియస్..

రష్మిక ఫేక్ మార్ఫింగ్ వీడియో వైరల్. అమితాబ్ బచ్చన్ రియాక్ట్ అవుతూ సీరియస్ ట్వీట్.

Update: 2023-11-06 07:03 GMT

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్న క్రేజ్ ఆమెది. దీంతో ఆమెకు సంబంధించిన ఏ చిన్న వీడియో అయినా, ఫోటో అయినా ఇట్టే వైరల్ అయ్యిపోతుంటాయి. తాజాగా రష్మికకి సంబంధించిన ఒక ఫేక్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో పై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా సీరియస్ అయ్యారు.

Full View

డీప్‌నెక్ బ్లాక్‌ డ్రెస్‌ లో ఉన్న ఒక అమ్మాయికి సంబంధించిన వీడియోని రష్మిక పేస్ తో మార్ఫింగ్ చేసి నెట్టింట పోస్ట్ చేశారు. ఇక ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై ఓ జర్నలిస్ట్‌ అవుతూ.. ఆ వీడియోలో ఉన్నది రష్మిక కాదని, జారా పటేల్ అనే అమ్మాయి అని తెలియజేశాడు. వీడియో స్టార్టింగ్ లో 1Sec దగ్గర గమనిస్తే అసలు నిజం తెలుస్తుందని పేర్కొన్నాడు. అంతేకాదు ఒరిజినల్ వీడియోని కూడా షేర్ చేశాడు.

ఇక ఇలా మార్ఫింగ్ చేయడం తీవ్ర నేరంగా పరిగణించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాడు. ఈ వీడియో పై పలువురు ప్రముఖులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే అమితాబ్ బచ్చన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 'లీగల్‌గా దీని మీద కఠిన చర్య తీసుకోవాలని' అమితాబ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ 'యానిమల్' సినిమాలో, టాలీవుడ్ లో 'పుష్ప 2', 'రెయిన్ బో' సినిమాల్లో నటిస్తుంది. రణబీర్ సరసన నటిస్తున్న యానిమల్ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కాబోతుంది. సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఒక్కో సాంగ్ ని రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు.

Tags:    

Similar News