అలా టీజర్ లో అవే ఉండబోతున్నాయా?
ఒక సంక్రాతి పుంజు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ టీజర్ వచ్చింది.. అందులో కామెడీ, యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్, మహేష్ లుక్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఇక [more]
ఒక సంక్రాతి పుంజు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ టీజర్ వచ్చింది.. అందులో కామెడీ, యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్, మహేష్ లుక్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఇక [more]
ఒక సంక్రాతి పుంజు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ టీజర్ వచ్చింది.. అందులో కామెడీ, యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్, మహేష్ లుక్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఇక మరో సంక్రాతి పుంజు అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో టీజర్ రావాల్సి ఉంది. ఎన్నిసార్లు చెప్పుకున్నా… అలా వైకుంఠపురములో సినిమాకి సాంగ్స్ అన్ని ఒక బలం కాగా.. ఇప్పుడు డిసెంబర్ 1 న టీజర్ రాబోతుంది. మరి అల్లు అర్జున్ – త్రివిక్రమ్ లు కలిసి అలా వైకుంఠపురములో టీజర్ లో ఏం చూపిస్తారో అనే క్యూరియాసిటీ మెగా ఫాన్స్ లోనే కాదు… ప్రేక్షకుల్లోనూ మొదలైంది.
ఆలా వైకుంఠపురములో ఇంతకుముందే విడుదలైన అల్లు అర్జున్ – మురళి శర్మల పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ తో పాటుగా ఈ టీజర్ ఫ్యామిలీ ఎమోషన్స్, త్రివిక్రమ్ మార్కు కామెడీ పంచ్ లు మరియు అల్లు అర్జున్ – పూజ హెగ్డే ల రొమాన్స్ అన్ని హైలెట్ గా ఉండబోతున్నాయని.. ప్రేక్షకులకు నచ్చేలా.. ప్రేక్షకులు, అభిమానులు మెచ్చేలా అలా వైకుంఠపురములో టీజర్ ని కట్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి త్రివిక్రమ్ మార్క్ కామెడీ, పంచ్ లకు అల్లు అర్జున్ మ్యానరిజం తోడైతే… ఆ డైలాగ్స్ పటాసుల్లా పేలడం ఖాయం అంటున్నారు. మరి పూజ హెగ్డే – బన్నీ రొమాన్స్, అల్లు అర్జున్ అండ్ మురళి శర్మల ఎమోషనల్ కామెడీ డైలాగ్స్ ని ఊహించేసుకుంటూ మెగా ఫాన్స్ పండగ చేసేసుకుంటున్నారు.