పాకిస్థాన్ ప్రజలు తెగ చూస్తున్న సినిమా 'మేజర్'

మహేశ్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, ఏ ప్లస్‌ ఏస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా నిర్మించిన ఈ చిత్రంలో

Update: 2022-07-08 08:54 GMT

పాకిస్థాన్ ప్రజలు మేజర్ సినిమాను తెగ చూస్తూ ఉన్నారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమాను పాక్ ప్రజలు బాగా చూస్తున్నారని తాజా ట్రెండ్స్ కన్ఫర్మ్ చేశాయి. పాకిస్థాన్ లో.. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన సినిమాల్లో మేజర్‌ మొదటి స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌, శ్రీలంకలో కూడా ఈ చిత్రం టాప్‌ 1లో నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో, మేజర్ హిందీ వెర్షన్ ప్రస్తుతం ట్రెండ్‌ల జాబితాలో ఒకటిగా ఉండగా, తెలుగు వెర్షన్ 2వ స్థానంలో ఉంది. మేజర్ చిత్రం పాకిస్థాన్ లో కూడా మొదటి స్థానంలో ట్రెండ్ అవుతూ ఉండడం విశేషం. శ్రీలంక, బంగ్లాదేశ్‌లో కూడా సినిమా నెంబర్ 1 స్థానంలో నిలిచింది. జూన్ 3వ తేదీన రిలీజైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. మేజర్ సినిమా భారతదేశంలోని ముంబైలో 2008 తాజ్ ప్యాలెస్ హోటల్ దాడి సమయంలో విధి నిర్వహణలో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కెరీర్ గురించి చూపించింది.

మహేశ్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, ఏ ప్లస్‌ ఏస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా నిర్మించిన ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్‌, శోభిత ధూళిపాళ, ప్రకాశ్‌ రాజ్‌, రేవతి ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు. ముంబై దాడుల్లో ఉగ్రవాదులతో వీరోచిత పోరాటం చేసి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఉన్నికృష్ణన్ పాత్రలో శేష్ నటించాడు. తెలుగు, హిందీతో పాటు విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి విజయం సాధించింది.


Tags:    

Similar News