గద్దర్ అవార్డుల జ్యూరీ ఛైర్మన్ గా జయసుధ

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీకి ఛైర్మన్ గా నటి జయసుధ ను ఎంపిక చేశారు.

Update: 2025-04-17 02:18 GMT

తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీకి ఛైర్మన్ గా నటి జయసుధ ను ఎంపిక చేశారు. పదిహేను మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటు చేశారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

దరఖాస్తుకు చివరి తేదీ...
ఈ అవార్డుల కోసం దరఖాస్తు చేసిన నామినేషన్లను ఈ నెల 21 నుంచి జ్యూరీ పరిశీలించనుంది. పరిశీలించిన నామినేషన్ల నుంచి గద్దర్ అవార్డులకు కమిటీ ఎంపిక చేయనుంది. ఎంపిక చేసిన వారికి గద్దర్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ఈ ఏడాది టాలీవుడ్ లో గద్దర్ అవార్డులను ఇవ్వనున్నారు.


Tags:    

Similar News