అత్యంత విషమంగా నటుడు శరత్ బాబు ఆరోగ్యం
ఈ ఏడాది మార్చి నెలలో అనారోగ్యానికి గురైన శరత్ బాబు.. తొలుత చెన్నైలో చికిత్స చేయించుకున్నారు. గతవారం ఆయన మరోమారు
actor sarath babu health bulletin
టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. 71 సంవత్సరాల శరత్‌బాబుకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ప్రత్యేక వైద్యబృందం చికిత్స అందిస్తోందని, వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆయన త్వరగా కోలుకుంటారని ఏఐజీ ఆసుపత్రి ఆశాభావం వ్యక్తం చేసింది.
ఈ ఏడాది మార్చి నెలలో అనారోగ్యానికి గురైన శరత్ బాబు.. తొలుత చెన్నైలో చికిత్స చేయించుకున్నారు. గతవారం ఆయన మరోమారు అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుండి ఆయన ఏఐజీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శరత్ బాబు ఆరోగ్య పరిస్థితిపై పలు పుకార్లు షికార్లు చేశాయి. శరత్ బాబు చనిపోయారంటూ కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు రాగా.. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం కూడా తెలిపారు.
ఈ నేపథ్యంలో శరత్ బాబు కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆ వార్తలన్నీ పూర్తి అవాస్తవాలని, వాటిని నమ్మవద్దని శరత్ బాబు సోదరి కోరారు. ఆయన కోలుకుని తర్వలోనే డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. ఇలాంటి ఫేక్ న్యూస్ లను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.