నాగ చైతన్య - సమంతలు అక్టోబర్ 6 వ తేదీన గోవాలో పెళ్లి చేసుకోబుతున్న విషయం తెలిసందే. ఈ పెళ్లి హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో జరుగుతుందని కూడా విదితమే. అయితే చై, సామ్ ల పెళ్లి అక్టోబర్ 6 నుండి 8 వరకు మూడు రోజుల పాటు జరగనుందట. మరి పెళ్లి కోసం ఈజంట మూడు నెలలు లాంగ్ బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నట్లుగా కూడా తెలిసిందే. తమ పెళ్లి పనులకోసం ఒక నెల, పెళ్లితర్వాత హనీమూన్ కోసం మరో రెండు నెలలు తమ ప్రొఫెషన్ కి దూరం కానుంది ఈ జంట.
ఇక పెళ్లి తర్వాతచేసుకోబోయే హనీమూన్ కోసం చై, సామ్ జంట న్యూయార్క్ నగరాన్ని ఎంచుకుందట. ఒక్క న్యూయార్క్ మాత్రమే కాకుండా మరికొన్ని దేశాల్లో ఏకంగా 40 రోజుల పాటు విహరించాలని ఫిక్స్ అయ్యారట. ఇక పెళ్లి కోసం ఈ జంట సెప్టెంబర్ రెండో వారం నుండి నవంబర్ చివరి వరకు సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందట.
ఇక సమంత, చైతన్యలు ఇద్దరూ సినిమాలతో బాగా బిజీగా వున్నారు. నాగ చైతన్య నటించిన ఒక సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా.. మరో సినిమా సెట్స్ మీదకెళ్లడానికి రెడీ అయ్యింది. ఇక సమంత నటించిన 'రాజుగారి గది 2 ' సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా... 'రంగస్థలం 1985, మహానటి' చిత్రాలు షూటింగ్ మధ్యలో వున్నాయి.