2019 లోనే మా పెళ్లి

Update: 2017-12-28 06:16 GMT

ఈ మధ్యన శృతి హాసన్ సినిమా ల విషయం కన్నా ఎక్కువగా పెళ్లి విషయంలోనే మీడియాలో హైలెట్ అయ్యింది. శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని విహరిస్తుందని..... త్వరలోనే వీరి పెళ్లనే ప్రచారం జరిగిన వేళ....

కన్నదాసన్ మనుమడి వెడ్డింగ్ సందర్భంగా కమల్ హాసన్, శృతి హాసన్ ఆమె బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కార్సెల్ లు కలిసికట్టుగా హాజరయ్యారు. అక్కడ వీళ్ళిద్దరూ ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు. శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కార్సెల్ తో కలిసి వెళ్లిన ఈ ఫంక్షన్ కి.. పంచెకట్టులో ఉన్న మైఖేల్ ను చూసి అంతా.. ఇక వీళ్ళ పెళ్లి రేపోమాపో ఖాయమనే అనుకున్నారు. వచ్చే ఏడాది లో వీళ్ళ పెళ్లి అనే వార్తలు కూడా వచ్చాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం.. శృతి ఇప్పట్లో పెళ్లి చేసుకోదట. 2019 లో మేం మ్యారేజ్ చేసుకుంటాం అని క్లారిటీ ఇచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ లో వెబ్ సిరీస్ తీయాలనే యోచనతో పాటు.. బాలీవుడ్ కొన్ని ప్రాజెక్టులను అంగీకరించిందని సమాచారం. ఆమె బాయ్ ఫ్రెండ్ మైఖేల్ మళ్ళీ లండన్ వెళ్లి పోయాడని.... ఈమె ముంబై లో మకాం పెట్టిందని టాక్.

Similar News