2018 మొత్తం విజయ్ హావ

Update: 2017-12-12 09:00 GMT

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ టాలీవుడ్ లో ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో తన నెక్స్ట్ మూవీస్ ఏంటో.... ఎలా ఉంటాయో అని అందరిలో ఆసక్తి కలుగుతుంది. విజయ్ కూడా తన నెక్స్ట్ మూవీస్ అన్ని అర్జున్ రెడ్డి రేంజ్ లో ఉండాలని అంతే కాకుండా డిఫరెంట్ గా కూడా ఉండాలని అనుకుంటున్నాడు.

2018 ఇయర్ స్టార్టింగ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సందడి చేయనున్నాడు. పరశురామ్ డైరెక్షన్ లో విజయ్ ఒక సినిమా అల్ మోస్ట్ కంప్లీట్ చేసాడు. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఆ సినిమాను భారీగానే తెరకెక్కిస్తోంది. అలాగే మనవాడు సినిమాటోగ్రాఫర్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేస్తున్నాడు. సావిత్రి బయోపిక్ లో కూడా ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడు విజయ్.

ఈ సినిమాలు అన్ని 2018 మొదట్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. గీతా గోవిందం - షికారు అనే సినిమాలు రెండు నెలల వ్యవధిలో రాబోతున్నాయట. ఇక సావిత్రి బయోపిక్ వాటి మధ్యలో రిలీజ్ కానుంది. 2018 విజయ్ ఫాన్స్ కు మంచి ట్రీట్ అని చెప్పవొచ్చు.

Similar News