2017 బెస్ట్ చిత్రమిదే

Update: 2017-12-12 11:00 GMT

ఈ సంవత్సరం వచ్చిన చిత్రాల్లో ‘బాహుబలి ది కంక్లూషన్’కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారనే చెప్పాలి. వెండితెర దృశ్యకావ్యంగా రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. విడుదలైన అన్ని భాషల్లో కలిపి సుమారు 1600కోట్లు వసూళ్లు కొల్లగొట్టింది ఈ చిత్రం. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం అంతే భారీ స్థాయి విజయాన్ని దక్కించుకుంది.

బాహుబలి తరువాత ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన మరో చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ఈ చిత్రం అదరగొట్టే టాక్ తో అదిరిపోయే కలెక్షన్స్ కురిపించింది. విజయ్ దేవరకొండ , షాలిని పాండే జంటగా నటించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించాడు. యువతరం ఆలోచనలకు , వారి ఆలోచనా విధానానికి దగ్గరగా ఉండే ఈ చిత్రం న్యూ ఏజ్ లవ్ స్టోరీ గా తెరకెక్కింది. ప్రేక్షకులకు ఈ చిత్రం విపరీతంగా నచ్చేసింది.. ముఖ్యంగా ఈ చిత్ర విజయంలో యువత కీలక పాత్ర వహించారు. ఈ చిత్రం విడుదలైనప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరూ ఈ చిత్రం పై ప్రశంశల వర్షం కురిపించారు. అందులో ఎస్ఎస్.రాజమౌళి , మహేష్ బాబు వంటి వారున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా.. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రాజమౌళిని 2017సంవత్సరంలో మీకు నచ్చిన సినిమా ఏంటి అని అడిగితే..రాజమౌళి బదులుగా ఈ సంవత్సరం నాకు నచ్చిన చిత్రం… ఒక తెలుగు చిత్రం, ఆ చిత్రమే అర్జున్ రెడ్డి. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలోని పెర్ఫార్మన్స్ లకు ఎంతోమంది అభిమానులైపోయారు. అందులో నేనూ ఒకడ్ని. అంటూ తన అభిమాన చిత్రం పై ప్రశంశలు కురిపించాడు.

Similar News