2 . 0 రికార్డులకు నెలవు

Update: 2017-12-29 10:00 GMT

దాదాపు 30 ఏళ్లుగా సౌదీలో సినిమాలు బంద్. అక్కడి ప్రజలు సినిమా చూడాలంటే పక్కనే ఉన్న అబుదాబి లేదా యూఏఈకు వెళ్లి రావాలి. అయితే ఇప్పుడు ఎట్టకేలకు సౌదీలో సినిమాలపై ఆంక్షలు తొలిగిపోయాయి. సౌదీ రాజు ఇక్కడ సౌదీ లో కూడా సినిమాలు విడుదల చేసుకోవచ్చని చెప్పాడు. వచ్చే ఏడాది మార్చి నుంచి సినిమాల్ని ప్రసారం చేసేందుకు సౌదీ రాజు అనుమతి ఇచ్చాడు.

మరి ఇలా సినిమాలు సౌదీ లో విడుదల చేసుకోవచ్చని.... క్లియరెన్స్ పొందిన వెంటనే అలా సౌదీ మార్కెట్ ను ఆక్రమించేందుకు రెడీ అయింది శంకర్ - రజినీకాంత్ ల కలయికలో ఆవస్తున్న 2.0 సినిమా. ఈ సినిమా ని దాదాపు 50 స్క్రీన్స్ లో సౌదీలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది లైకా ప్రొడక్షన్స్ సంస్థ. మరి నిజంగానే అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ 30 ఏళ్లలో ఇండియా నుంచి సౌదీలో విడుదలవుతున్న మొట్టమొదటి చిత్రంగా 2.0 రికార్డు సృష్టిస్తుంది.

అసలు సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే అనేక రికార్డులకు నెలవుగా మరింది. భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రంగా ఇప్పటికే రికార్డు సృష్టించింది. దర్శకుడు శంకర్ ఎప్పటినుండో చెక్కుతున్న 2.0 సినిమా గ్రాఫిక్స్ వర్క్ పూర్తికాని కారణంగా జనవరిలో విడుదలవ్వాల్సిన ఈ సినిమా ని వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇకపోతే ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శంకర్ దర్శకుడు. ఏఆర్ రెహ్మాన్ సంగీత దర్శకుడు

Similar News