మహేష్ బాబు, మురగదాస్ కలయికలో స్పైడర్ చిత్రం మరో 10 రోజుల్లో విడుదలకు సిద్దమవవుతుంది.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్ జే సూర్య విలన్ గా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటె తాజాగా విడుదలైన స్పైడర్ ట్రైలర్ అందరిని ఇంప్రెస్స్ చేస్తుంది. స్పైడర్ పాత్రల విషయంలో మహేష్ అభిమానులు కొంచెం నిరాశ చెందినా గాని.... స్పైడర్ ట్రైలర్ మాత్రం వాళ్ళ అంచనాలని డబల్ చేసింది అంటున్నారు. అయితే మరో పది రోజుల్లో విడుదల కానున్న స్పైడర్ రేపు సెన్సార్ కి వెళ్లనుంది.
సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమా చూసాక ఏం సర్టిఫికేట్ ఇస్తారా అని మహేష్ అభిమానులతో పాటే సాధారణ ప్రేక్షకులు అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటె ఈ సినిమా గురించి దర్శకుడు మురగదాస్ మాట్లాడుతూ స్పైడర్ సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ మరియు క్లైమాక్స్ ఎక్కువ హైలైట్ అవుతుంది అని చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ సినిమాతో మహేష్ బాబు తమిళ్ లో గ్రాండ్ గా లాంచ్ అవ్వబోతున్నాడు.ఇప్పటి వరకు మహేష్ సినిమాలన్ని తమిళ్ లో డబ్ అయినవే గాని ఏ ఒక్క సినిమా కూడా స్ట్రెయిట్ గా రిలీజ్ అవ్వలేదు.
అయితే ఇప్పుడు స్పైడర్ మాత్రం అటు తెలుగు లో ఇటు తమిళ్ లో ఒకేసారి తెరకెక్కింది కాబట్టి అక్కడ స్ట్రెయిట్ గా రిలీజ్ అవ్వబోతుంది. ఇదిలా ఉంటె ఈ మూవీ సెప్టెంబర్ 27 న దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది. మరి విడుదలకు 10 రోజుల ముందే సెన్సార్ పని ముగించేస్తుంది ఈ సినిమా.