10 కోట్లా ? ....

Update: 2018-01-18 07:43 GMT

పెళ్లిచూపులు విజయంతో హీరోగా గుర్తింపు తెచ్చుకుని, అర్జున్ రెడ్డి చిత్రంతో యువతని తన అభిమానులుగా మార్చుకున్న యువ కథానాయకుడు విజయ్ సాయి దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్ ట్రేండింగ్ యంగ్ హీరోస్ లో ఒకరు. అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ స్థాయి అమాంతం పెరిగిపోయింది. స్టార్ హీరోస్ సైతం పని చేయాలని ఎదురు చూసే ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ వారి నిర్మాణంలో ఒకటికి రెండు చిత్రాలు చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికే టాక్సీ వాలా అనే చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల దశలో ఉండగా గీత ఆర్ట్స్ నిర్మాణంలోనే మరో చిత్రం సెట్స్ పై ఉండటం విశేషం.

శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో అల్లు శిరీష్ కి తొలి విజయం ఇచ్చిన దర్శక రచయిత పరశురామ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న మరో చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి గీత గోవిందం అనే పేరు పరిశీలన లో వుంది. ఇప్పటి వరకు విజయ్ నటించిన చిత్రాలన్నీ లో బడ్జెట్ చిత్రాలే. అన్ని నాలుగు కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం మించనివే. అయితే తొలి సారి విజయ్ సాయి దేవరకొండ చిత్రానికి ఏకంగా పది కోట్ల రూపాయల ఖర్చుతో ఈ సినిమా నిర్మిస్తుంది గీత ఆర్ట్స్ సంస్థ. యువ హీరో మరియు సక్సెస్ వున్నా క్రేజ్ లేని దర్శకుడి చిత్రానికి అల్లు అరవింద్ ఇంత రిస్క్ చేస్తున్నారంటే ఈ చిత్ర కథ ఆయనని ఎంతగా మెప్పించిందో అర్ధం చేసుకోవచ్చు.

Similar News