రష్యాకు షాకిచ్చిన యూట్యూబ్, గూగుల్ ప్లే

ఇదివరకే యూ ట్యూబ్, గూగుల్ రష్యా వాణిజ్య ప్రకటనలను నిషేధించాయి. తాజాగా చెల్లింపులతో కూడిన సేవలన్నింటినీ రష్యాలో..

Update: 2022-03-10 12:13 GMT

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలుపెట్టిన తొలిరోజు నుంచి.. రష్యాపై ఆంక్షల పరంపర కొనసాగుతోంది. అమెరికా సహా నాటో, ఈయూ దేశాలు, పలు వాణిజ్య సంస్థలు రష్యాపై వరుసగా ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయి. తాజాగా యూట్యూబ్, గూగుల్ ప్లే సంస్థలు రష్యాకు షాకిచ్చాయి. ఈ రెండు సంస్థలకు చెందిన అన్ని చెల్లింపుల సేవలను రష్యాలో నిలిపివేస్తున్నట్లు మాతృ సంస్థ ఆల్ఫాబెట్ గురువారం ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

ఇదివరకే యూ ట్యూబ్, గూగుల్ రష్యా వాణిజ్య ప్రకటనలను నిషేధించాయి. తాజాగా చెల్లింపులతో కూడిన సేవలన్నింటినీ రష్యాలో నిలిపివేస్తున్నట్లు ఆ రెండు సంస్థలు తెలిపాయి. ఈ నిర్ణయంతో రష్యాకు చెందిన వినియోగదారులకు యూ ట్యూబ్ ప్రీమియమ్, ఛానెల్ మెంబర్ షిప్, సూపర్ ఛాట్, మర్కెండైజ్ సేవలు అందుబాటులో ఉండవు. పాశ్చాత్య దేశాలు ర‌ష్యాకు సంబంధించి బ్యాంకింగ్ సేవ‌ల‌ను నిలిపివేయ‌డంతో త‌మ సేవ‌ల చెల్లింపుల‌కు అంత‌రాయం కలుగుతుండటంతో ఆ రెండు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News