పిల్లలకు యూట్యూబ్ బ్యాన్.. మంచి నిర్ణయమే కదా!!
ఆస్ట్రేలియా ప్రభుత్వం పిల్లలకు యూట్యూబ్ ను నిషేధించింది.
ఆస్ట్రేలియా ప్రభుత్వం పిల్లలకు యూట్యూబ్ ను నిషేధించింది. 16 ఏళ్లలోపు పిల్లలు ఇకపై యూట్యూబ్ ఖాతాలను తెరవడానికి వీలు లేదు. డిసెంబర్ నెల నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఇప్పటికే టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా వేదికల నుండి పిల్లలను దూరం చేశారు. పిల్లలను ఆన్‌లైన్ ప్రమాదాల నుంచి కాపాడటమే ఈ నిర్ణయానికి కారణమని ఆస్ట్రేలియా ప్రభుత్వం చెబుతోంది. సైబర్‌బుల్లీయింగ్, అవాంఛనీయ కంటెంట్ ప్రభావాలకు గురికావడం, సోషల్ మీడియా ఎక్కువగా వాడటం వల్ల వచ్చే మానసిక ఆరోగ్య సమస్యల నుంచి పిల్లలను రక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఆస్ట్రేలియా ప్రజల్లో పది మందిలో తొమ్మిది మంది ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. భవిష్యత్తులో ఇతర దేశాలు కూడా ఇలాంటి భద్రతా చర్యలను అమలు చేస్తే మంచిదని పలువురు పిలుపునిస్తున్నారు.