అమెరికా లెఫ్టినంట్ గవర్నర్‌గా తెలుగు మహిళ

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో హైదరాబాద్ కు చెందిన మహిళ ఎన్నికయ్యారు. మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా అరుణా మిల్లర్ ఎన్నికయ్యారు.

Update: 2022-11-09 12:25 GMT

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో హైదరాబాద్ కు చెందిన మహిళ ఎన్నికయ్యారు. మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా అరుణా మిల్లర్ ఎన్నికయ్యారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన భారత సంతతికి చెందిన కాట్రగడ్డ అరుణ రిపబ్లికన్ పార్టీ నేతపై పోటీ చేసి విజయం సాధించారు. అరుణతో పాటు మరో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి వెన్ మూర్ కూడా విజయం సాధించారు. గవర్నర్ తర్వాత అత్యంత కీలకమైన హోదాలో లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఉంటారు.

లెఫ్టినంట్ గవర్నర్ గా....
గవర్నర్ సరిగా విధులు నిర్వర్తించలేని సమయంలో లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు బాధ్యతలను అప్పగించే సంప్రదాయం అమెరికాలో ఉంది. మేరీలాండ్ లో రిపబ్లికన్ మద్దతు దారులు ఎక్కువగా ఉన్నారు. అయినా అరుణ విజయం సాధించారు. 58 ఏళ్ల కాట్రగడ్డ అరుణ హైదరాబాద్ లో జన్మించారు. ఏడేళ్ల వయసులో ఆమె అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అరుణ విజయం పట్ల ఇక్కడ ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News