మిస్ ఇంగ్లాండ్ ఆరోపణల్లో నిజమేమిటో.. విచారణకు ఆదేశం

మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ తీరుపై మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది.

Update: 2025-05-26 09:56 GMT

మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ తీరుపై మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. తెలంగాణ ఆతిథ్యం బాగుందని చెబుతూనే, నిర్వాహకుల తీరుపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.


తెలంగాణ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్, మరో ఐపీఎస్ అధికారిణి రమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీలతో కూడిన త్రిసభ్య కమిటీని విచారణ నిమిత్తం ఏర్పాటు చేసింది. పోటీల్లో పాల్గొన్న ఇతర యువతులను కూడా విచారించి, వారి వాంగ్మూలాలను నమోదు చేస్తోంది. మిల్లా మాగీ ఆరోపణల్లో నిజమెంతో తెలుసుకోడానికి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News