Israel and Iran : యుద్ధం ముగిసేటట్లు లేదు.. రోజురోజుకూ పెరుగుతున్న దాడులు.. ఆవిరవుతున్న ప్రాణాలు

ఇజ్రాయిల్ - ఇరాన్ ల మధ్య యుద్ధం తీవ్రమయింది. రెండు దేశాలు పరస్పర దాడులకు దిగడంతో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు

Update: 2025-06-17 03:19 GMT

ఇజ్రాయిల్ - ఇరాన్ ల మధ్య యుద్ధం తీవ్రమయింది. రెండు దేశాలు పరస్పర దాడులకు దిగడంతో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలాది విలువైన ఆస్తినష్టం జరుగుతుంది. వరసగా క్షిపణులపై దాడులకు దిగుతున్నాయి. ఇటు ఇజ్రాయిల్, అటు ఇరాన్ ఏ దేశమూ తగ్గకపోవడంతో యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. దంతో పశ్చిమాసియాలో విమానాశ్రయాలను మూసివేశారు. ఇజ్రాయిల్ పై ఇరాన్ వందకు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అమెరికా దౌత్య కార్యాలయం వద్ద క్షిపణి పడింది. పేలుళ్లతో దద్దరిల్లిన ఇజ్రాయెల్ దద్దరిల్లింది.

పౌర నివాసాలపై...
ఇరాన్ మిసైల్స్ తో దాడికి దిగడంతో ఇజ్రాయెల్ దద్దరిల్లింది. టెల్ అవీవ్, హైఫాను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేయగా పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి. ఈ దాడుల్లో నివాస భవనాలు ధ్వంసమయ్యాయని చెబుతున్నారు. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని, పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. కాగా భారీగా క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ పేర్కొంది. అటు తాము ఎంచుకొన్న లక్ష్యాలపై దాడులు చేస్తే, ఇరాన్ మాత్రం ఇష్టం వచ్చినట్లుగా అటాక్ చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది.
టెహ్రాన్ ఖాళీ చేయాలంటూ...
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ప్రజలంతా ఆ నగరాన్ని ఖాళీ చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. 'ఇరాన్ డీల్ మీద సంతకం చేసుండాల్సిందని, వారిని నేను సంతకం చేయమని చెప్పానని, ఎంత సిగ్గుచేటు, ఎంతమంది ప్రాణాలను తీస్తున్నారని ట్రంప్ ప్రశ్నించారు. ఇరాన్ అణ్వాయుధాలను దక్కించుకోలేదని చాలా స్పష్టంగా పదే పదే చెప్పానని, టెహ్రాన్లో ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే ఆ నగరాన్ని ఖాళీ చేయాలంటూ ట్రంప్ ట్రూత్ లో పోస్ట్ చేశారు. కానీ ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ పట్టించుకునే పరిస్థితుల్లో కనిపించడం లేదు. తమపై దాడికి దిగిన ఇజ్రాయిల్ పై తాము ప్రతిదాడులకు మాత్రమే దిగుతున్నానని అది అంతర్జాతీయ సమాజం ముందు వాదిస్తుంది.
అమెరికా చేరితే?
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో అమెరికా కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదుల సంఖ్యలో యూఎస్ యుద్ధవిమానాలు మిడిల్ ఈస్ట్ వైపుగా వచ్చాయని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతిచ్చే అవకాశాలు స్పష్టంగా ఉ్ానయి. ట్రంప్ చేస్తున్న ప్రకటనలు కూడా ఇందుకు అద్దం పడుతున్నాయి. మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్ గగన తలంపై తాము పూర్తి పై చేయి సాధించామని ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించిదంి. ఇరాన్ క్షిపణి వ్యవస్థలో మూడో వంతు భాగాన్ని ఇప్పటికే నాశనం చేశామని తెలిపింది. మొత్తం మీద ఇజ్రాయిల్ - ఇరాన్ ల మధ్య ఇప్పట్లో ముగింపు కనిపించడం లేదు.
Tags:    

Similar News