Iran and Israel War : దాడులు - ప్రతిదాడులు..తగ్గని ఇరు దేశాలు.. భయనకంగా మారిన ఇరాన్, ఇజ్రాయిల్
ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం తీవ్రమయింది
ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం తీవ్రమయింది. ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణులతో దాడులకు దిగడంతో ప్రతిగా ఇరాన్ పై ఇజ్రాయిల్ కూడా భారీ ఎత్తున దాడులకు దిగింది. బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంది. ఈ దాడుల్లో ఖమేనీ సన్నిహిత సలహాదారు మృతి చెందిననట్లు సమాచారం. బాంబుపేలుళ్లతో టెహ్రాన్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. టెహ్రాన్ నగరాన్ని వదలి జనం వెళ్లపోతున్నారు. మరొకవైపు మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడికి దిగింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గకపోగా రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య రాజీ కుదర్చాలన్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు.
సామాన్య పౌరులు...
ఇజ్రాయిల్ - ఇరాన్ దాడులు ప్రతిదాడులకు దిగుతుండటంతో సామాన్య పౌరుల మరణిస్తున్నారు. ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తుండగా, ఇజ్రాయిల్ ఇరాన్ పై బాంబులతో విరుచుకుపడుతుంది. గత ఐదు రోజుల నుంచి కొనసాగుతున్న దాడులతో రెండు దేశాలు భారీగా నష్టపోయాయి. ఆస్తినష్టంతో పాటు భారీగా ప్రాణనష్టం కూడా సంభవించింది. ఎవరూ తగ్గడం లేదు. తాము ఇరాన్ లోని అణుకేంద్రాలు, సైనిక స్థావరాలను మాత్రమే దాడులు చేస్తున్నామని ఇజ్రాయిల్ చెబుతుంది. అదే సమయంలో ఇరాన్ తమ దేశంలోని పౌరుల నివాసాలపై క్షిపణులతో దాడులకు దిగుతూ సామాన్య్యుల ప్రాణాలను బలితీసుకుంటుందని, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతోంది.
ప్రతీకరం తీర్చుకోవడానికి....
ఇజ్రాయిల్ లోని మోస్సాద్ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఇరాన్ డ్రోన్ల తయారీ కేంద్రాన్ని ధ్వంసం చేసింది. ట్రెహ్రాన్ డౌన్ టౌన్ కు సమీపంలో ఉన్న 3,30,000 మంది ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ హెచ్చరికలు జారీ చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. టెహ్రాన్ లో దాదాపు కోటి మంది వరకూ జనాభా ఉండగా గత ఐదు రోజుల నుంచి కొన్నివేల మంది నగరం విడిచి వెళ్లిపోయారు. పూర్తిగా ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ పిలుపునిచ్చింది. ఇప్పటివరకూ ఇరాన్ కు చెందిన 227 మంది మరణించారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. మరొక వైపు ఇజ్రాయిల్ కు కూడా అంతే నష్టం జరిగింది. ఇరవై వరకూ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడంతో ఇజ్రాయిల్ లో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు అందుతున్నాయి. ఇజ్రాయిల్ కు చెందిన 24 మంది మరణించారని, ఐదు వందలకు మందికి పైగా గాయపడ్డారని ప్రకటించింది.