Iran and Israel War : ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధంలో వందల మంది మృతి.. ఉన్నతాధికారులు బంకర్లలోకి
ఇరాన్ - ఇజ్రాయల్ ల మధ్య యుద్ధం కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న యుద్ధంతో అనేక మంది మరణించారు.
ఇరాన్ - ఇజ్రాయల్ ల మధ్య యుద్ధం కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న యుద్ధంతో అనేక మంది మరణించారు. ఇప్పటి వరకూ ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో తమ దేశానికి చెందిన 224 మంది చనిపోయారని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో అత్యధికంగా సాధారణ పౌరులేనని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత శుక్రవారం మొదలయిన దాడులు నిరంతరం కొనసాగుతున్నాయి. దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియలో యుద్ధం భీకరంగా మారింది. ఇజ్రాయిల్ తాము కేవలం ఇరాన్ సైనిక శిబిరాలు, అణు కేంద్రాలపైనే దాడులు జరిపామని చెబుతుండగా, ఇారాన్ మాత్రం సామాన్య పౌరులు మరణించినట్లు వెల్లడించింది. అయితే ప్రతి దాడుల్లో పథ్నాలుగు మంది ఇజ్రాయిల్ పౌరులు కూడా మరణించారని చెబుతున్నారు.
భయానక పరిస్థితులు...
ఇరాన్ రాజధాని టెహ్రాన్ దాదాపు ఖాళీగా కనిపస్తుంది. అనేక ప్రాంతాలు ధ్వంసం కావడంతో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరాన్ సుప్రీంలీడర్ఆయతొల్లా ఖమేనీ కూడా సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయినట్లు తెలిసంి. ఖమేనీ బంకర్ లో తలదాచుకున్నారని సమాచారం. ఇజ్రాయిల్ దాడులను తీవ్రతరం చేయడంతో పాటు శాస్త్రవేత్తలు, సైనికాధికారులను లక్ష్యంగా చేసుకోవడంతో ఆయన బంకర్ లోకి వెళ్లిపోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సిటీని వదిలి దూరంగా వెళ్లిపోతున్నారు. ప్రధాన రహదారుల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
నెతన్యాహూ ఆరోపణలు...
అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను హతమార్చేందుకు ఇరాన్ ప్లాన్ చేసిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. అందుకే న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ పై తీవ్రంగా పనిచేసిందన్నారు. ట్రంపే ఆ దేశానికి మొదటి విలన్ అని నెతన్యాహూ వెల్లడించారు. తమకూ న్యూక్లియర్ ముప్పు ఉందని, ఇరాన్ పై దాడి చేసి వాటిని ధ్వంసం చేయడం మినహా మరో అప్షన్ లేదని చెప్పారు. తన ఇంటిపై దాడి చేసినా పాలనపై ఫోకస్ చేశానని, ఇకపై ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.దీంతోఇరాన్-ఇజ్రాయెల్ పోరు మరింత ముదురుతున్నట్లు కనపడుతుంది. టెహ్రాన్ పై డ్రోన్లతో ఇజ్రాయెల్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. కారుబాంబు పేలుడులో ఆరుగురు అణు శాస్త్రవేత్తలు మృతి చెందారని చెబుతున్నారు.ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతిదాడులకు దిగుతుండటతో భీకరంగా మారింది.