America : అగ్రరాజ్యం అమెరికా మరోసారి షట్ డౌన్.. అప్పుడూ.. ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడే
ఏడేళ్ల తర్వాత తొలిసారి అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ను ఎదుర్కొంటుంది.
ఏడేళ్ల తర్వాత తొలిసారి అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ను ఎదుర్కొంటుంది. కీలకమైన బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ను ఎదుర్కొంటుంది. ఏడేళ్ల తర్వాత తొలిసారి ఇలా జరిగిందని అమెరికా ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. రెండు నిధుల బిల్లులను సెనెట్ ఆమోదించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ లోకి వెళ్లినట్లు ప్రకటించింది. ఈరోజు ఉదయం భారత కాలమాన ప్రకారం 9.30 గంటలకు షట్ డౌన్ ప్రక్రియ ప్రారంంభమయింది.
కీలకమైన బిల్లులు ఆమోదం....
కీలకమైన బిల్లులు ఆమోదం పొందకపోవడంతోనే అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ను ఎదుర్కొంటుంది. డెమొక్రాట్లు స్టాపేజీ ఫండింగ్ బిల్లులను అడ్డుకోవడంతోనే అమెరికా షట్ డౌన్ మొదలయింది. దీంతో ఎమెర్జెన్సీ సేవలు మినహాయించి దాదాపు అన్ని సేవలు నిలిచిపోయాయి. ఈ ప్రభావం లక్షలాది మంది ప్రభుత్వోద్యోగులపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. మిలటరీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి ఎమెర్జెన్సీ సేవలు మాత్రం కొనసాగుతున్నాయి. ప్రభుత్వం షట్ డౌన్ పరిస్థితుల్లో చెక్ లు కూడా జారీచేయని పరిస్థితి నెలకొంటుంది.
దీర్ఘకాలం కొనసాగితే...
సెలవుల్లో పనిచేయించకున్నా పాత వేతనాలను మాత్రమే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేషనల్ సర్వీస్ పార్కులు మూతబడ్డాయి. ఈ ప్రభావం ఫలితం వెంటనే చూపకపోయినప్పటికీ దీర్ఘకాలం షట్ డౌన్ కొనసాగితే మాత్రం అమెరికా ఆర్థికాభివృద్ధి మందగిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ఎంతకాలమో కొనసాగే వీలుండదని కూడా తెలిపారు. 2018లో జరిగిన షట్ డౌన్ కంటే ఈసారి తీవ్రత ఒకింత ఎక్కువగానే ఉంటుందని మాత్రం అంగీరిస్తున్నారు. అప్పుడు కూడా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు కూడా మరోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడే మరోసారి షట్ డౌన్ మొదలు కావడం చర్చనీయాంశంగా మారింది.