ఇరాన్ అణు స్థావరాలపై.. అమెరికా దాడి
ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై అమెరికా విజయవంతంగా దాడులు పూర్తి చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
Iran
ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై అమెరికా విజయవంతంగా దాడులు పూర్తి చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని ట్రంప్ వెల్లడించారు. మూడు అణు స్థావరాలపై దాడులు చేసిన తర్వాత అమెరికా విమానాలన్నీ ఇరాన్ గగనతలం నుంచి బయటకు వచ్చేశాయన్నారు. ప్రధాన స్థావరమైన ఫోర్డోపై పూర్తిస్థాయి బాంబుల పేలోడ్‌తో దాడి చేశామని, అన్ని విమానాలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు తిరుగు ప్రయాణమయ్యాయని ప్రకటించారు. ప్రపంచంలో మరే ఇతర సైన్యం కూడా ఇలాంటి దాడి చేయలేదని, శాంతికి సమయం ఆసన్నమైందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇది ఒక చారిత్రక ఘట్టమని, ఇరాన్ ఇప్పుడు ఈ యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ కోరారు.