Israel : హమాస్ కోసం ఇజ్రాయిల్ వైమానిక దాడులు

గాజాలో ఇజ్రాయిల్ జరిపిన దాడులతో ఎనభై మంది వరకూ మరణించారు

Update: 2025-05-16 02:24 GMT

గాజాలో ఇజ్రాయిల్ జరిపిన దాడులతో ఎనభై మంది వరకూ మరణించారు. గాజా ప్రాంతంలో ఒక్కరోజులోనే ఎనభై మంది వరకూ మృతి చెందారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇజ్రాయిల్ జరిపిన వైమానికి దాడుల్లో యాభై నాలుగు మంది వరకూ మరణించారని తెలిసింది. వీరిలో చాలా మంది వరకూ మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. ఖాన్ యూనిస్ లోని నాసర్ ఆసుపత్రి క్షతగాత్రులతో కిటకిటలాడిపోతుంది. కాల్పుల్లో గాయపడిన వారికి చికిత్స అందించడానికి కూడా సరైన బెడ్లు దొరకడం లేదు. ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లోనే యాభై నాలుగు మంది వరకూ చనిపోయారని చెబుతున్నారు. దీంతో పాటు గాజా నగరంతో పాటు ఉత్తర గాజా ప్రాంతాల్లోనూ జరిగిన వైమానిక దాడుల్లో మరో ఇరవై ఆరు మంది వరకూ మరణించారని అధికారులు స్పష్టం చేశారు.

హమాస్ ను హతమార్చేందుకు...
హమాస్ ను హతమార్చేందుకు ఇజ్రాయిల్ గాజాపై ఈ వైమానిక దాడులు జరిపిందని చెబుతున్నారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యూహు ప్రకటన చేసిన అనంతరం ఈ దాడులు జరిగాయని అంటున్నారు. హమాస్ ను మట్టుబెట్టేందుకు గాజాలోకి ఇజ్రాయిల్ సైన్యం గాజాలోకి ప్రవేశిస్తుందని ఆయన ప్రకటించిన తర్వాత ఈ వైమానిక దాడులు జరిగాయాని ప్రభుత్వం ఆరోపిస్తుంది. దాడులు ఎక్కువ కావడంతో గాజాలో ప్రాణ భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొంత కాలం నుంచి నిలిచిపోయిన దాడులు తిరిగి ప్రారంభం కావడంతో ప్రాణాలు దక్కించుకోవడానికి ఇతర ప్రాంతాలకు వలస పోవడం ప్రారంభించారు.
కాల్పుల విరమణ తర్వాత...
ఈ ఏడాది మార్చి 18వ తేదీ నుంచి కాల్పుల విరమణ కొనసాగింది. రెండు నెలల పాటు కొనసాగిన కాల్పుల విరమణ తిరిగి ప్రారంభం కావడంతో గాజాలో ఎనభై మంది వరకూ మరణించారని చెబుతున్నారు. యుద్ధం ప్రారంభమయిన నాటి నుంచి ఇప్పటివరకూ దాదాపు యాభై మూడు వేల మంది పాలస్తీనీనియులు మరణించగా, పది వేల మంది వరకూ గాయపడ్డారు. గాజాలో ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. వారికి చికిత్స అందించలేకపోతున్నామని, సరైన వసతి సౌకర్యాలు కూడా లేవని వైద్యులు చెబుతున్నారు. బ్లడ్ కూడా దొరకడం లేదని, చాలా ఇబ్బందిగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ యుద్ధ వాతావరణంతో గాజా తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హమాస్ కోసం అమాయకుల ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారని అంటున్నారు.
Tags:    

Similar News