భారీ వర్షం.. ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రాకండి
సౌదీ అరేబియాలో అకాల వర్షం ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది
సౌదీ అరేబియాలో అకాల వర్షం ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. జెడ్డా నగరంలో అకాల వర్షాలు కురవడంతో భారీ వరద పోటెత్తింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. రాకపోకలు నిలిచిపోయాయి. అనేక చోట్ల ఇళ్లు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాలకు వెళ్లే దారి లేక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఒక్కసారిగా కురిసిన వర్షాలు అతలాకుతలం చేశాయి.
నీట మునిగిన...
జెడ్డాలోని మక్కా ప్రావిన్స్ లోని పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితి అయితేనే బయటకు రావాలని, లేదంటే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని హెచ్చరించారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ వార్నింగ్ ఇచ్చింది.