గోల్డెన్ డోమ్.. పక్కా ప్లాన్ అంటున్న ట్రంప్
అత్యాధునికమైన గోల్డెన్ డోమ్‌ను సిద్ధం చేస్తోంది.
ఇప్పటి వరకూ మనం ఐరన్ డోమ్ గురించి మాత్రమే విన్నాం. అమెరికా అంతకు మించిన ప్లాన్ లో ఉంది. అత్యాధునికమైన గోల్డెన్ డోమ్‌ను సిద్ధం చేస్తోంది. గగనతల రక్షణ వ్యవస్థలో భాగంగా అమెరికా అంతరిక్షంలో కూడా ఆయుధాలను మోహరిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందుకు సంబంధించిన ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టుకు విలువ 175 బిలియన్ డాలర్లు ఉంటుంది.
అమెరికాను బాలిస్టిక్, క్రూజ్ క్షిపణుల దాడుల నుంచి రక్షిస్తుంది. అమెరికా వైపు వచ్చే క్షిపణులు, ఇతర ముప్పులను ముందుగానే పసిగడుతుంది. టేకాఫ్ అవ్వక ముందు, లేదంటే మార్గమధ్యంలోనే వాటిని ధ్వంసం చేయనుంది. గోల్డెన్ డోమ్‌కు ప్రస్తుతం 25 బిలియన్ డాలర్లు కేటాయించారు. మొత్తం నిర్మాణానికి 175 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని ట్రంప్ చెబుతున్నారు.