సౌతాఫ్రికా పై టీమిండియా ఘనవిజయం

సెంచూరియన్ లో సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా పై భారత్

Update: 2021-12-30 12:47 GMT

సెంచూరియన్ లో సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా పై భారత్ 113 పరుగుల తేడాతో విజయఢంకా మ్రోగించింది. ఈ ఘనవిజయంతో భారత్ మూడు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యతను సాధించింది. ఇక సౌతాఫ్రికా విషయానికొస్తే.. రెండో ఇన్నింగ్స్ లో 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు.. 191 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లలో ఎల్గర్ (77), బవుమా (35), డికాక్ (21) తప్ప మిగిలిన బ్యాట్స్ మెన్లు ఎవరూ రాణించలేకపోయారు. దీంతో టీమిండియాను విజయం వరించింది.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రాహుల్

తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించి ఇండియాను ఉన్నత స్థితిలో నిలిపిన కేఎల్ రాహుల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 327 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 197 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 174 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. సౌతాఫ్రికా 191 పరుగులకు ఆలౌట్ అయింది. 
టీమిండియా సాధించిన ఈ విజయంపై పలువురు క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు. వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, సురేష్ రైనాతో పాటు బీసీసీఐ టీమిండియాను అభినందించింది.



Tags:    

Similar News