అక్కడ కూడా పబ్జీ, టిక్ టాక్ బ్యాన్

రానున్న మూడు నెలల్లో ఈ రెండు యాప్ లను పూర్తిగా బ్యాన్ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పబ్ జీ, టిక్ టాక్ వల్ల

Update: 2022-09-20 11:19 GMT

మొబైల్ గేమింగ్ లో ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసిన గేమింగ్ అప్లికేషన్ పబ్జీ. ఈ గేమ్ ఆడి ఆడి.. చాలా మంది మెంటల్ గా డిస్టర్బ్ అయితే.. కొందరు ఎదుటివారిని హత్య చేయడం, గేమ్ ఆడవద్దని మందలిస్తే ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు చాలానే ఉన్నాయి. కాగా.. భారత్ లో చైనా యాప్ లు చాలావాటిని బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. వాటిలో పబ్జీ, టిక్ టాక్ కూడా ఉన్నాయి. తాజాగా ఈ రెండు యాప్ లను ఆప్ఘనిస్థాన్ లో కూడా బ్యాన్ చేస్తున్నట్లు తాలిబన్లు నిర్ణయించారు.

రానున్న మూడు నెలల్లో ఈ రెండు యాప్ లను పూర్తిగా బ్యాన్ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పబ్ జీ, టిక్ టాక్ వల్ల తమ దేశంలో యువత తప్పుదోవ పట్టకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తాలిబన్లు చెబుతున్నారు. భద్రత, షరియా చట్ట అమలు సంస్థ సభ్యులతో దేశ టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ సమావేశం నిర్వహించిన తర్వాత 90 రోజులలో పబ్ జీ, టిక్‌టాక్ ను ఆఫ్ఘన్ లో నిషేధిస్తున్నట్టు ప్రకటన వెలువడింది. పబ్ జీ ని నిషేధించేందుకు మూడు నెలల సమయం పట్టినప్పటికీ.. టిక్ టాక్ ను ఒక నెలరోజుల్లోనే నిషేధించనున్నారు.


Tags:    

Similar News