గడ్డం లేకుంటే.. ఊద్యోగం ఊడినట్లే

తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్థాన్ లో అనేక నిబంధనలను అమలు చేస్తున్నారు

Update: 2022-03-29 05:39 GMT

తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్థాన్ లో అనేక నిబంధనలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది ఖచ్చితంగా గడ్డం పెంచుకోవాల్సిందేనని, గడ్డం లేకపోతే ఉద్యోగం ఊడబెరుకుతామని తాలిబన్లు హెచ్చరించారు. దీంతో పాటు ఉద్యోగులు ఖచ్చితంగా డ్రెస్ కోడ్ ను అనుసరించాల్సిందేనని పేర్కొాన్నరు. సంప్రదాయ వస్త్రధారణతో పాటు తలకు టోపీ పెట్టుకుని విధులకు హాజరు కావాల్సిందేనని ఆదేశించారు.

షేవింగ్ చేసుకోవద్దు....
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ షేవింగ్ చేసుకోవద్దన్నారు. డ్రెస్ కోడ్ పాటించని వారికి ప్రభుత్వ కార్యాలయాల్లోకి అనుమతి లేదని పేర్కొన్నారు. ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరవ్ాత బాలిక విద్యను నిషేధించారు. పురుషులు తోడు లేకుండా మహిళలు విమాన ప్రయాణం చేయవద్దని ఆంక్షలు విధించారు. ప్రభుత్వ ఉద్యోగాల నుంచి కూడా మహిళలను తొలగించారు. తాజాగా గడ్డం లేకపోతే ఉద్యోగాలు ఊడబీకేస్తామని వారు హెచ్చరించారని అంతర్జాతీయ మీడియా లో కథనాలు వెలువడ్డాయి.


Tags:    

Similar News