మబ్బు తొడిగిన కిరీటం.. ఆకాశంలో ఆవిష్కృతమైన అద్భుతం

ఆ అద్భుతాన్ని ఫోటోలు వీడియోలు తీసి.. తమ సోషల్ మీడియా ఖాతాల్లో అప్ లోడ్ చేయగా.. అవి కాస్తా వైరల్ అయ్యాయి.

Update: 2022-09-10 10:32 GMT

ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఆకాశంలో మేఘాలు ఏర్పడటం, అవి రకరకాల ఆకారాల్లో కనిపించడం, వర్షం కురిసినపుడు ఇంధ్ర దనస్సు కనిపించడం మామూలే. కానీ ఓ మేఘం టోపీ ఆకారంలో కనిపించడం ఒక వింతైతే.. దాని చుట్టూ ఇంద్ర ధనస్సు కిరీటంలా ఏర్పడటం అబ్బురపరిచింది. ఇది నిజంగా ప్రకృతి సృష్టించిన అందమే. మబ్బు తొడిగిన కిరీటం లా ఉన్న ఆ దృశ్యం నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ అద్భుతమైన దృశ్యం చైనాలోని హైకూ నగరంలో ఆవిష్కృతమైంది. ఇది చూసిన అక్కడి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆ అద్భుతాన్ని ఫోటోలు వీడియోలు తీసి.. తమ సోషల్ మీడియా ఖాతాల్లో అప్ లోడ్ చేయగా.. అవి కాస్తా వైరల్ అయ్యాయి. ట్విట్టర్‌ లోని సన్‌ లిట్‌ రెయిన్‌ పేరిట ఉన్న ఖాతాలో పోస్ట్‌ అయిన వీడియోకు ఏకంగా 2.87 కోట్ల వ్యూస్‌ నమోదవడం గమనార్హం. కానీ.. ఇంద్ర ధనస్సు అలా ఎందుకు ఏర్పడిందన్న విషయం ఎవరికీ అర్థం కాలేదు.
ఏదైనా ఓ ప్రాంతంలో అకస్మాత్తుగా క్యుములో నింబస్‌ మేఘాలు రూపొందే క్రమంలో.. గాలి వేగంగా ఎత్తుకు చేరుకుని టోపీ లేదా గొడుగు ఆకారంలో మేఘాలు ఏర్పడుతాయి. వీటినే క్యాప్‌/స్కార్ఫ్‌ క్లౌడ్స్‌ అంటారు. ఇలాంటి క్యాప్‌ క్లౌడ్‌ పై ఏర్పడిన ఇంద్ర ధనుస్సు వైరల్‌ గా మారింది.





Tags:    

Similar News