Earth Quake : ఆప్ఘానిస్తాన్‍లో వరుస భూ ప్రకంపనలు

ఆప్ఘానిస్తాన్‍లో వరుస భూ ప్రకంపనలు ఆందోళన కలిగించాయి.

Update: 2025-07-19 04:05 GMT

ఆప్ఘానిస్తాన్‍లో వరుస భూ ప్రకంపనలు ఆందోళన కలిగించాయి. వరుసగా మూడుసార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.6గా నమోదయిందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ప్రాణ, ఆస్తి నష్టంపై మాత్రం అధికారిక ప్రకటన వెలువడలేదు.

మయన్మార్, టిబెట్ లోనూ...
మయన్మార్ లో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 3.7గా నమోదయింది. టిబెట్‍లోనూ భూప్రకంపనలు తలెత్తడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వరస భూప్రకంపనలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. టిబెట్ లో భూకంప తీవ్రత 3.6గా నమోదయిందని అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం ఏమీ జరగలేదని తెలిపారు.


Tags:    

Similar News