భారత్‍తో సంబంధాలపై పుతిన్ ఏమన్నారంటే?
భారత్‍తో సంబంధాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు
భారత్‍తో సంబంధాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‍తో దీర్ఘకాలిక ఆర్థిక సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని పుతిన్ తెలిపారు. భారత్ తో తమకు సత్సంబంధాలు కొనసాగించాలన్న నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే ఇందుకు అవసరమైన ప్రణాళికలను కూడా త్వరలో సిద్ధం చేయబోతున్నట్లు తెలిపారు.
దీర్ఘకాలిక బంధంపై...
భారత్ తో స్నేహ హస్తం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. భారత్‍తో 2030 వరకు దీర్ఘకాలిక సహకారం కోసం ప్రణాళికను త్వరలో ఖరారు చేయబోతున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. భారత్‍తో ఆయిల్, గ్యాస్ ఉత్పత్తులను పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు ఉంటాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు.