భారత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన రష్యా.. ఇంతకీ ఆఫరేంటో తెలుసా ?

రష్యా ఇచ్చిన ఆఫర్ పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రష్యా ఓపెన్ ఆఫర్ ఇచ్చిన విషయం వాస్తవమేనన్న కేంద్రం.. దానిపై నిర్ణయం తీసుకునేముందు

Update: 2022-03-12 11:45 GMT

న్యూ ఢిల్లీ : ఉక్రెయిన్ పై యుద్ధం కొనసాగిస్తోన్న రష్యా.. భారత్ కు మరోసారి బంపరాఫర్ ఇచ్చింది. యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. దాంతో దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతాయని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రష్యా భారత్ కు అతి తక్కువ ధరకే క్రూడాయిల్ విక్రయిస్తామని మరోసారి చెప్పింది. ఈసారి ఏకంగా రష్యా డిప్యూటీ ప్రధాని అలెగ్జాండర్ నొవాక్ ఈ విషయం గురించి నేరుగా కేంద్రంతో మాట్లాడారు.

కేంద్రమంత్రి హర్దిప్ పూరికి ఫోన్‌ చేసి మాట్లాడినట్లు నోవాక్‌ తెలిపారు. కాగా.. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేయడంపై అమెరికా సహా నాటో దేశాలు గుర్రుగా ఉన్నాయి. దీంతో గడిచిన రెండు వారాలుగా రష్యా చమురు కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర 139 డాలర్లకు చేరగా.. రష్యా వద్ద కొనుగోళ్లు తగ్గడంతో భారీగా నిల్వలు పేరుకుపోతున్నాయి.
కాగా.. రష్యా ఇచ్చిన ఆఫర్ పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రష్యా ఓపెన్ ఆఫర్ ఇచ్చిన విషయం వాస్తవమేనన్న కేంద్రం.. దానిపై నిర్ణయం తీసుకునేముందు అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే అమెరికా, యూరోపియన్‌ దేశాలకు వ్యతిరేకంగా అడుగులు వేసినట్లవుతుంది. రష్యా ఇచ్చిన ఆఫర్ ను ఓకే చేస్తే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నియంత్రించవచ్చు. మరి భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Tags:    

Similar News