రావాలి రిషి.. కావాలి రిషి

Update: 2022-10-21 01:28 GMT

బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. బ్రిటన్ ప్రధాని పదివి చేపట్టిన 45 రోజులకే ఆమె పదవికి రాజీనామా చేశారు. ప్రధాని పదవికి ట్రస్ రాజీనామాతో బ్రిటన్ లో మరోమారు రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇటీవలే బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన ట్రస్... మినీ బడ్జెట్ ప్రవేశపెట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆర్థిక సంక్షోభాన్ని అదుపు చేయలేక మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ప్రధాని పదవి రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్ తో పోటీ పడి మరీ లిజ్ ట్రస్ విజయం సాధించారు. ఆమె ప్రభుత్వం ఇటీవలే మినీ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. మినీ బడ్జెట్ పై విమర్శలు చెలరేగడం, అందుకు దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతూ ట్రస్ ప్రకటన విడుదల చేయం జరిగింది. అదే సమయంలో దేశంలో ఆర్థిక సంక్షోభం మరోసారి పెరిగిపోవడంతో.. ట్రస్ కేబినెట్ లోని పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మంత్రులు రాజీనామాలు చేయడంతో వ ట్రస్ ప్రధాని పదవికి రాజీనాామా చేశారు. బ్రిటన్ చరిత్రలో అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా ట్రస్ చెత్త రికార్డును సొంతం చేసుకున్నారు.

తదుపరి ప్రధాని ఎవరన్న దానికి కన్జర్వేటివ్ పార్టీ నేత, ఇటీవల ఎన్నికల్లో లిజ్ ట్రస్ కు పోటీదారుగా నిలిచిన్ రిషి సునాక్ పేరు గట్టిగా వినిపిస్తోంది. మాజీ ఆర్థికమంత్రి అయిన రిషి సునాక్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బ్రిటన్ ను నడిపించగలడన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. మరోసారి బ్రిటన్ నాయకత్వం కోసం ఎన్నికలు జరిగితే రిషి సునాక్, జెరెమీ హంట్, పెన్నీ మోర్డాంట్ ల మధ్య ప్రధాన పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సునాక్, మోర్డాంట్ గత ఎన్నికల్లోనూ ప్రధాని రేసులో పోటీపడ్డారు. అయితే తుదిరేసులో లిజ్ ట్రస్, సునాక్ మిగిలారు. ఇప్పుడు సునాక్ బ్రిటీష్ ప్రధాని అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.


Tags:    

Similar News