Narendra Modi : బ్రెజిల్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ చేరుకున్నారు. పదిహేడవ బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన బ్రెజిల్ చేరుకున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ చేరుకున్నారు. పదిహేడవ బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన బ్రెజిల్ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ లోని రియో డ జనిరో చేరుకోగానే ఘన స్వాగతం పలికారు. బ్రెజిల్ లోని భారతీయులు పెద్దయెత్తు స్వాగతం పలికారు. నాలుగు రోజుల పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ లోనే ఉండనున్నారు.
బ్రిక్స్ సమావేశంలో...
ఈ పర్యటనలో బ్రెజిల్ లో జరిగే బ్రిక్స్ సమావేశంలో పాల్గొన్న అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని బ్రెసిలియాలో పర్యటిస్తారు. ప్రధాని మోదీ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు బ్రిక్స్ సమావేశంలో చర్చలు ఫలవంతమవుతాయని ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం ఎనిమిది రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉండనున్నారు.