ట్రంప్ కు సుంకాలపై ఎదురుదెబ్బ

అమెరికా ఫెడరల్ కోర్టులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పుచెప్పింది

Update: 2025-08-30 03:43 GMT

అమెరికా ఫెడరల్ కోర్టులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పుచెప్పింది. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలకు సంబంధించిన వస్తువుల ఎగుమతులపై ట్రంప్ అధిక సుంకాలను విధించడాన్ని అమెరికా ఫెడరల్ కోర్టు అభ్యంతరం తెలిపింది. ఇది చట్టవిరుద్ధమని పేర్కొంది.

అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పు మేరకు...
డొనాల్డ్ ట్రంప్ తన ఎమెర్జెన్సీ అధికారాలను అతిక్రమించి భారీగా సుంకాలు విధించారని అమెరికా ఫెడరల్ కోర్టు అభిప్రాయపడింది. అయితే పెంచిన టారిఫ్ లను అక్టోబరు వరకూ కొనసాగించడానికి అనుమతి ఇచ్చింది. సుంకాల పెంపు పలు దేశాలపై తీవ్ర ప్రభావితం చేసిందని కూడా అమెరికా ఫెడరల్ కోర్టు వ్యాఖ్యానించింది. అదే సమయంలో తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు అనుమతించింది.


Tags:    

Similar News