పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు
పోప్ ఫ్రాన్సిస్ కన్ను మూశారు. వాటికన్ సిటీలో ఆయన మృతి చెందారు.
పోప్ ఫ్రాన్సిస్ కన్ను మూశారు. వాటికన్ సిటీలో ఆయన మృతి చెందారు. నిన్న ఈస్టర్ సందర్భంగా సందేశం ఇచ్చిన పోప్ ఫ్రాన్సిస్ కొద్దిసేపటి క్రితం భౌతికంగా దూరమయ్యారు. ఆయన వయసు ఎనభై ఎనిమిదేళ్లు. గత కొద్ది రోజులుగు పోప్ ఫ్రాన్సిస్ శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
ఈస్టర్ సందర్భంగా...
పోప్ ఫ్రాన్సిస్ మరణంతో వాటికన్ సిటీతో పాటు ప్రపంచం మొత్తం విషాదంలో మునిగిపోయింది. వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ మరణించడం పట్లు పలువురు దేశాధినేతలు సంతాపాన్ని ప్రకటించారు. 1936 డిసెంబరు 17న అర్జెంటీనాలో పోప్ ఫ్రాన్సిస్ జన్మించారు. మార్చి 13, 2013న ఆయన 266వ పోప్ గా ఎన్నికయ్యారు. తొలిసారి అమెరికా ఖండం నుంచి ఎన్నికైన తొలి వ్యక్తిగా పోప్ ఫ్రాన్సిస్ గా పేరు తెచ్చుకున్నారు.